ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియను తనిఖీ చేసిన కలెక్టర్

నిజామాబాద్, బతుకమ్మ: "మహిళా ఉన్నతి - తెలంగాణ ప్రగతి" కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఐ.కే.పీ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్న తీరును తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి పారదర్శకంగా, సజావుగా జరగాలని అన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి తెలంగాణ సంప్రదాయాన్ని అనుసరిస్తూ గౌరవ ప్రదమైన రీతిలో...