ఎంపిడిఒ కాంప్లెక్స్ లోని శిథిలావస్థలో ఉన్న భవనాన్ని పరిశీలించిన కలెక్టర్
మాచారెడ్డి, బతుకమ్మ : మాచారెడ్డి మండల కేంద్రం ఏం.పి.డి.ఒ. కాంప్లెక్స్ లోని శిథిలావస్థలో ఉన్న భవనం ను బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. ఆ భవన స్థానంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మించడానికి పరిశీలన చేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం మాచారెడ్డి మెయిన్ రోడ్డులో చెత్త వేయడం ద్వారా చెత్త కుప్ప పేరుకుకొని పోయింది, అట్టి విషయంలో జిల్లాలో పారిశుధ్య కార్యక్రమాలు సజావుగా జరుపాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు ను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో పారిశుధ్య కార్యక్రమాల్ని నిరంతరంగా ప్రతీ...