పదవ తరగతి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన కలెక్టర్

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఆర్మూర్ పట్టణంలోని రాంమందిర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు మామిడిపల్లిలో గల సెయింట్ పాల్స్ హైస్కూల్ లో కొనసాగుతున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులు హాజరు గురించి ఆరా తీయగా, రెండు కేంద్రాలలోనూ పూర్తి స్థాయిలో హాజరు అయ్యారని నిర్వాహకులు తెలిపారు.     నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా?...