బతుకమ్మ,మెండోరా: భూభారతి కార్యక్రమంలో భాగంగా పైలెట్ ప్రాజెక్టుగా మెండోరా మండలాన్ని ఎంపిక చేయడంతో అక్కడ జరుగుతున్న భూభారతి కార్యక్రమాలను సోమవారం నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. సంబంధిత రికార్డులను పరిశీలించి ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.