కామారెడ్డి,బతుకమ్మ : మాచారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధి లోని పాల్వంచ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని (ఉప ఆరోగ్య కేంద్రాన్ని) జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయుష్మంన్ ఆరోగ్య కేంద్రం లో (ఉప ఆరోగ్య కేంద్రంలో ) అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి సేవల గురించి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి.చంద్రశేఖర్, జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభు కిరణ్, మండల ప్రత్యేక అధికారి, రెవెన్యూ శాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
