మంత్రి సీతక్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్న నేపధ్యంలో మంత్రి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో ఇన్ చార్జి మంత్రి పాల్గొననుండగా, కలెక్టర్ ఆడిటోరియంను సందర్శించారు. ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు...