సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

కామారెడ్డి, బతుకమ్మ : ఈనెల 4న గురువారం ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి పర్యటించనున్న జిల్లాలోని వివిధ ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి పరిశీలించారు. తాడ్వాయి మండలం  ఎర్ర పహాడ్ వద్ద ముఖ్యమంత్రి హెలిక్యాప్టర్ దిగేందుకు  ఏర్పాటుచేసిన హెలిపాడ్ ను పరిశీలించి ఇన్చార్జిలుగా చూసుకోవాలని  ఆర్డీవో కామారెడ్డి, తహసిల్దార్  తాడ్వాయి లకు సూచించారు. అనంతరం లింగంపేట్ మండలంలో లో దెబ్బతిన్న లింగంపల్లి  కుర్దు వంతెనను పరిశీలించి ముఖ్యమంత్రి వచ్చే సమయంలో  ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా  చూడాలని, వరద...