నీట్ ఎగ్జామ్ సెంటర్ లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఈ నెల 21 న జరగనున్న నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ను పురస్కరించుకుని కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నాగారంలో గల తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. పరీక్ష నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లను, అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. ప్రశ్న పత్రాలను తరలించే రూట్ మ్యాప్ ను సైతం స్వయంగా పరిశీలించారు. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్యన...