కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన కలెక్టర్

బతుకమ్మ ,నిజామాబాద్ సిటి: భారీ వర్షాల నేపథ్యంలో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నెలకొల్పిన కంట్రోల్ రూమ్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. కంట్రోల్ రూమ్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్న విధానాన్ని, సంబంధిత అధికారులకు వెంటదివెంట సమాచారం తెలియజేస్తూ అప్రమత్తం చేస్తున్న తీరును పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి. వాటిని ఎవరికి తెలియజేశారు తదితర వివరాలను కంట్రోల్ రూమ్ లో ఆపరేటర్ గా విధులు నిర్వర్తిస్తున్న సమాచార పౌర సంబంధాల...