బోధన్ ఏటీసీ కేంద్ర నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీ) నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు సూచించారు. బోధన్నూ పట్టణ శివారులో నూతనంగా నిర్మిస్తున్న ఏటీసీ భవన సముదాయం నిర్మాణ పనులను కలెక్టర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు కేవలం బేస్ లెవెల్ వరకే నిర్మాణం పనులు జరగడాన్ని గమనించిన కలెక్టర్, పనుల్లో జాప్యంపై అధికారులను ప్రశ్నించారు. వర్షపు జలాలు నిలిచి ఉండడంతో పనులు చేపట్టలేకపోయామని, ఇకపై వేగంగా పనులు...