వర్నిలో సీ.హెచ్.సీ,  పాఠశాలలను తనిఖీ చేసిన కలెక్టర్

నిజామాబాద్, బతుకమ్మ : విద్య, వైద్య రంగాల పనితీరులో గణనీయమైన మార్పు కనిపించేలా అంకిత భావంతో పని చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. బుధవారం ఆయన వర్ని మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను, పాత వర్ని లో ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతో పాటు, మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల గురుకులాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీ.హెచ్.సీ లోని లేబొరేటరీ రూమ్, ఇన్ పేషంట్ వార్డ్, హెల్ప్ డెస్క్, వ్యాక్సినేషన్ రూమ్...