Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 8:36 pm Posted by : ramakrishna

ఎన్యూమరేషన్ ఫారంను బీఎల్ఓ కు అందజేసిన కలెక్టర్

 

. . . ఈ నెల 24 లోపు ఎన్యూమరేషన్ ఫారంలు అందించాలి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం తన ఎన్యూమరేషన్ ఫారంను బీ.ఎల్.ఓకు అందజేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం అయిన జూన్ 25వ తేదీన బీఎల్ఓ, సూపర్వైజర్ లు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ (నివాసానికి)కు వచ్చి రెండు ఎన్యూమరేషన్ ఫారంలను అందజేసి వెళ్ళారు. వాటిని పూర్తి వివరాలతో నింపిన అనంతరం కలెక్టర్ గురువారం సాయంత్రం బీఎల్ఓ కు ఫోన్ ద్వారా సమాచారం అందించి క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని వివరాలతో నింపిన ఎన్యూమరేషన్ ఫారం అందజేశారు. మరో ఎన్యూమరేషన్ ఫారంపై బీఎల్ఓ సంతకం చేసి ఎక్ నాలెడ్జ్ మెంట్ రూపంలో కలెక్టర్ కు అందించారు. ఎన్యూమరేషన్ ఫారం స్వీకరించినట్టుగా ఆన్ లైన్ ద్వారా బీ.ఎల్.ఓ మొబైల్ యాప్ లో అప్ డేట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణలో అందరూ పాల్గొనాలని ఓటర్లను కోరారు. ఈ నెల 24వ తేదీ నాటితో గడువు ముగియనున్నందున,  ప్రతి ఓటరు నిర్దేశిత గడువు లోపు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారంను నింపి బీ.ఎల్.ఓ కు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినయ్ సాగర్, బీ.ఎల్.ఓ రుక్మిణి, సూపర్వైజర్ హరీష్ రెడ్డిలు పాల్గొన్నారు.