జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నియమ నిష్ఠలతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు కొనసాగించడం ఎంతో గొప్ప విషయమన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో కాలం వెళ్లదీయాలని, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, దాన ధర్మాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నమైన ముస్లిం సోదరులు, అదే స్ఫూర్తితో శనివారం...