Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 September 2024, 6:47 pm Posted by : ramakrishna

కమాండ్ కంట్రోల్ రూం నుంచి  శోభాయాత్రను వీక్షించిన కలెక్టర్, సీపీ

బతుకమ్మ, నిజామాబాద్ సిటి : నగరంలో జరిగే గణేష్ శోభాయాత్రను పోలీస్ కమండ్ కంట్రోల్ రూమ్ నుండి సీసీ కెమెరాల ద్వారా జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంతు,  సీపీ కల్మేశ్వర్ లు వీక్షించారు. మంగళవారం గణేష్ నిమజ్జోత్సవం సందర్భంగా జరిగే శోభాయాత్రలో భాగంగా నగరంలో శోభాయాత్ర మార్గంలో సీపీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో రథయాత్ర నిర్వహించే ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా కలెక్టర్, సీపీ,మున్సిపల్ కమిషనర్లు వీక్షించారు. శోభాయాత్రలో ఎక్కడ ఎలాంటి అల్లర్లు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడినా, అనుమానితులు కనిపించినా సీసీ కెమెరాల ద్వారా గుర్తించి స్థానికంగా ఉన్న పోలీసులకు నిర్ధేశం చేయనున్నారు.