Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 June 2025, 3:46 pm Posted by : ramakrishna

కేంద్ర హోంమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్, సీపీ సమీక్ష

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నెలకొల్పిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈ నెల 29 కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచ్చేస్తున్న సందర్భంగా ఆయన పర్యటన ఏర్పాట్లపై గురువారం ఐ.డీ.ఓ.సీ కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కేంద్ర మంత్రి అమిత్ షా హాజరు అవుతుండడంతో, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని హెలిప్యాడ్ ను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆర్ అండ్ బీ అధికారులకు  సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా కేంద్ర హోం మంత్రి పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రతా పరంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టాలని సీ.పీ సాయి చైతన్య పోలీసు అధికారులకు సూచించారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ లు అంకిత్, కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Collector, CP review arrangements for Union Home Minister's visit