Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 September 2025, 4:22 pm Posted by : ramakrishna

వినాయకునికి కలెక్టర్, సీపీ ప్రత్యేక పూజలు

నిజామాబాద్, బతుకమ్మ : వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంగణం(కలెక్టరేట్)లో ప్రతిష్టించిన వినాయకుడికి కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వేద బ్రాహ్మణులచే సాంప్రదాయబద్ధంగా పూజాదికాలు జరిపించి, అన్నదానం నిర్వహించారు. రోజువారీగా వివిధ శాఖల ఆధ్వర్యంలో వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలు జరిపిస్తున్నారు. గురువారం నాటి పూజలలో జిల్లా పాలనాధికారి, సీ.పీ, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. పూజా కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఉద్యోగులు పాల్గొన్నారు.

Collector, CP offer special prayers to Lord Ganesha