ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, సీ.పీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 6న నిజామాబాద్ జిల్లా పర్యటనకు హాజరు కానున్న నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, పొలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య జిల్లా అధికారులతో కలిసి మంగళవారం సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని సీ.ఎం సభా స్థలిగా ఖరారు చేసిన నేపధ్యంలో కలెక్టర్ , సీ.పీ క్షేత్రస్థాయిలో ఆ ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. సీఎం...