విద్యార్థులను అభినందించిన కలెక్టర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఇటీవల వెలువడిన పదవ తరగతి ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన సిరికొండ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల విద్యార్థులను కలెక్టర్ ఇలా త్రిపాఠి అభినందించారు. 582 మార్కులు సాధించిన సుదీప్తినితో పాటు 550 పైన మార్కులు సాధించిన విద్యార్థులు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని అభినందిస్తూ, భవిష్యత్తులో మీరు ఏమి కావాలని కోరుకుంటున్నారని వారి లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇదే స్ఫూర్తితో ఉన్నత విద్యను అభ్యసించాలని...