రెంజల్ మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

అభివృద్ధి పనులు, భూభారతి దరఖాస్తులపై అధికారులతో సమీక్ష   రెంజల్, బతుకమ్మ :  రెంజల్ మండలంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వీరన్నగుట్ట లోని జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి సెంటర్ లను కలెక్టర్ సందర్శించారు. పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది హాజరును పేస్ రికగ్నేషన్ విధానం (ఎఫ్.ఆర్.ఎస్) ద్వారా చేపడుతున్నారా లేదా అని పరిశీలించారు. యూడైస్ లో అందరు విద్యార్థుల నమోదు పూర్తయ్యిందా అని ఆరా తీశారు. కిచెన్, టాయిలెట్స్, తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్,...