మోపాల్, ముదక్ పల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
వసతి గృహాలు, ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల సందర్శన నిజామాబాద్, బతుకమ్మ : మోపాల్, ముదక్ పల్లిలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముదక్ పల్లి గ్రామంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహాన్ని, మోపాల్ మండల కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్, ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించారు. మోపాల్, ముదక్ పల్లి హాస్టళ్లను తనిఖీ చేసి, విద్యార్థుల హాజరును పరిశీలించారు. విద్యార్థులకు రాత్రి భోజనంలో అందించిన ఆహార పదార్థాలు మెనూకు అనుగుణంగా ఉన్నాయా అని పరిశీలించారు....