ఎడపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల సందర్శన ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి దరఖాస్తులపై సమీక్ష ఎడపల్లి, బతుకమ్మ : ఎడపల్లి మండల కేంద్రంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారీగా రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష జరిపారు. వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యిందా తదితర...