ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
నిజామాబాద్, బతుకమ్మ : ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ధర్పల్లి మండలం ఒన్నాజిపేట్ లోని జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి సెంటర్, ఎరువుల గోడౌన్ లను కలెక్టర్ సందర్శించారు. అలాగే, ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లిలో గల అంగన్వాడి కేంద్రాలను, సహకార సంఘం ఎరువుల గిడ్డంగిని తనిఖీ చేశారు. పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది హాజరును పేస్ రికగ్నేషన్ విధానం (ఎఫ్.ఆర్.ఎస్) ద్వారా చేపడుతున్నారా అని ఆరా తీశారు. విద్యార్థుల ప్రవేశాలు, హాజరవుతున్న వారి...