బోర్గాం(పీ)లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
నిజామాబాద్, బతుకమ్మ: మోపాల్ మండలం బోర్గాం(పీ) గ్రామంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఆయుష్మాన్ భారత్ – హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ (పల్లె దవాఖాన), శాఖా గ్రంథాలయం, సొసైటీ ఎరువుల గిడ్డంగిని తనిఖీ చేశారు. పల్లె దవాఖానాను సందర్శించిన కలెక్టర్, సిబ్బంది హాజరును పరిశీలించారు. ఈ హెల్త్ సెంటర్ ద్వారా అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీస్తూ, రికార్డులను తనిఖీ చేశారు. ఇమ్యునైజేషన్, ఏ.ఎన్.సీ చెకప్ లు, టీ.బీ ముక్త్ భారత్ అభియాన్, ఆరోగ్య శిబిరాల...