ఆలూరు లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

నిజామాబాద్, బతుకమ్మ :   ఆలూరు మండలంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా పరిషత్ హై స్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సహకార సంఘం ఎరువుల గోడౌన్, తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ సందర్శించారు. ముందుగా కల్లడి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. పీ.హెచ్.సీ ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను, అందుబాటులో ఉన్న ఔషధ నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. స్థానికంగానే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్ కు సూచించారు. వ్యాక్సినేషన్ వంద శాతం...