సాలూర జిల్లా పరిషత్ హై స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

   బోధన్ , బతుకమ్మ: సాలూర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులను పరిశీలించారు. ఎఫ్.ఆర్.ఎస్ విధానంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు ప్రక్రియను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. మౌలిక వసతులు, అందుబాటులో ఉన్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా విద్యార్థుల కు పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి, విద్యార్థుల సంఖ్య కు అనుగుణంగా...