రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
ధాన్యం బస్తాల దిగుమతి, మిల్లింగ్ ప్రక్రియల పరిశీలన నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా కేంద్రానికి సమీపంలో గల అర్సపల్లి, ఖానాపూర్, సారంగాపూర్ ప్రాంతాలలోని రైస్ మిల్లులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి అర్సపల్లిలోని రుద్రా రైస్ మిల్లును, ఖానాపూర్ లోని ఎల్.జీ ఆగ్రో ఇండస్ట్రీస్, వీరభద్ర రైస్ మిల్లు, సారంగాపూర్ లోని అనూ ఫుడ్స్ రైస్ మిల్లులను సందర్శించారు. ఆయా మిల్లులకు కొనుగోలు కేంద్రాల నుండి ఎన్ని లారీల...