రెంజల్ పీ.హెచ్.సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
రెంజల్, బతుకమ్మ: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. రెంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్, ఇన్ పేషంట్, ల్యాబ్, డిస్పెన్సరీ, ఫార్మసీ, ఇమ్యూనైజేషన్ రూమ్, తదితర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీసిన కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో వైద్యులు లేకపోవడం పట్ల ఆగ్రహం...