ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

బతుకమ్మ,ఏర్గట్ల: జిల్లా కలెక్టర్ బుధవారం ఏర్గట్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ప్రాథమిక సహకార సంఘాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.ఇందులో భాగంగా వర్షాకాలంలోని సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు,టీకాలు, మందుల లభ్యత పై డాక్టర్ రక్షిత ను మరియు సోసైటీలో  ఎరువుల స్టాక్ గురించి మండల వ్యవసాయ అధికారి వైష్ణవ్ ని అడిగారు,ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శివకృష్ణ, ఎంపీడీవో వెంకటేశ్వర్లు,తహసీల్దార్ మల్లయ్య, ఎంపీఓ శివచరణ్, పాల్గొన్నారు.