కస్తూర్బా బాలికల విద్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : బోధన్ మండలం అమ్దాపూర్ లో కొనసాగుతున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ లను తనిఖీ చేశారు. విద్యార్థులకు సిద్ధం చేసిన మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. పాఠశాల పరిసరాలు నిశితంగా పరిశీలించిన కలెక్టర్, బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ...