కస్తూర్బా బాలికల విద్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

  సిరికొండ, బతుకమ్మ :   సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాల పరిసరాలను, వంట గది, స్టోర్ రూమ్, తరగతి గదులను పరిశీలించారు. పరిసరాలు పిచ్చి మొక్కలతో నిండి అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులు విష కీటకాల బారినపడితే ఎవరు బాధ్యులని నిలదీశారు. వెంటనే పరిసరాలను శుభ్రం చేయించాలని, దోమలు వృధ్ధి చెందకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది, విద్యార్థినుల...