కంజర రెసిడెన్షియల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

నిజామాబాద్, బతుకమ్మ : మోపాల్ మండలం కంజర గ్రామంలో గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్/కళాశాలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని విభాగాలను తిరుగుతూ, నిశితంగా పరిశీలించారు. కిచెన్, డార్మెటరీ, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్ లలో వసతులను పరిశీలన జరిపారు. విద్యార్థినుల కోసం సిద్ధం చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. స్టోర్ రూంలో నిల్వ ఉన్న బియ్యం, పప్పు దినుసులు, వంట నూనె ఇత్యాది సరుకుల నాణ్యతను పరిశీలించారు.  విద్యార్థినుల ఆరోగ్య...