ఆరోగ్య ఉప కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం ఆకస్మితిక తనిఖీ చేశారు. రిజిస్టర్లు పరిశీలించి తనిఖీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కురిసిన వానల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోగులకు సరిపడ మందులు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.  జడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు చదువు ఎలా సాగుతుందో పరిశీలించారు. ఎలాంటి సమస్యలు...