Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 August 2025, 6:23 pm Posted by : ramakrishna

ఆరోగ్య ఉప కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం ఆకస్మితిక తనిఖీ చేశారు. రిజిస్టర్లు పరిశీలించి తనిఖీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కురిసిన వానల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోగులకు సరిపడ మందులు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.  జడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు చదువు ఎలా సాగుతుందో పరిశీలించారు. ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారిస్తానని ఉన్నత చదువులు చదివి సమాజ హితానికి దోహద పడాలని విద్యార్థులకు ఆయన సూచించారు. అనంతరం ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక ఇతర ముడి సరుకులను సమకూర్చాలన్నారు.ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ శ్రీనివాస్ ఎమ్మార్వో సునీత ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి డాక్టర్ హేమీమా సిబ్బంది సతీష్ ఉన్నారు.

Collector conducts surprise inspection of health sub-center