Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 August 2025, 7:01 pm Posted by : ramakrishna

డిచ్ పల్లి సీ.హెచ్.సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

. . . తహసీల్దార్ కార్యాలయం పరిశీలన

డిచ్ పల్లి, బతుకమ్మ : 

 

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. శనివారం ఆయన డిచ్ పల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్, ఇన్ పేషంట్, ఫిమేల్, జనరల్ వార్డులు, ల్యాబ్ తదితర విభాగాల పనితీరు పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీసిన కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. ప్రతి రోజు ఎంత మంది పేషంట్లు వస్తున్నారు, స్థానికంగానే కాన్పులు చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు.

Collector conducts surprise inspection of Ditch Pally CHC

సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని వైద్యులకు సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. ప్రతీ నెల రెండవ శనివారం ప్రత్యేకంగా నిర్వహించే ఆరోగ్యశ్రీ శిబిరానికి అన్ని విభాగాల స్పెషలిస్టు డాక్టర్లు హాజరయ్యేలా చూడాలని, పీ హెచ్ సీ లు, సీ హెచ్ సీల పనితీరును ప్రతి రోజు పర్యవేక్షణ చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ డిచ్ పల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యల గురించి తహసీల్దార్ సతీష్ రెడ్డిని ఆరా తీశారు. త్వరితగతిన అర్జీలు పరిష్కరించాలని సూచించారు.

Collector conducts surprise inspection of Ditch Pally CHC