కుర్నాపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
శాఖల పనితీరుపై క్షుణ్ణంగా సమీక్ష ఎడపల్లి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. గ్రామ పంచాయతీ, పల్లె దవాఖానా, ఎరువుల గిడ్డంగిని తనిఖీ చేసి, శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. పల్లె దవాఖానా వద్ద సిబ్బంది హాజరు, పేషంట్ల రిజిస్టర్లు పరిశీలించిన కలెక్టర్, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై ఆరోగ్య కార్యకర్తలతో మాట్లాడారు. గ్రామంలో డెంగ్యూ కేసు నమోదైన నేపథ్యంలో ఫాగింగ్ లేని విషయం వెలుగులోకి రావడంతో...