ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష
. . . లాటరీ విధానం ద్వారా డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారుల ఎంపిక నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఇందిరమ్మ పథకం కింద మంజూరు చేసిన ఇళ్ళను లబ్దిదారులు వేగవంతంగా పూర్తి చేసుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావు కల్పిస్తే ఉపేక్షించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల...