కలెక్టర్ విస్తృత తనిఖీలు
రేషన్ షాపును సందర్శించి సన్నబియ్యం పంపిణీపై ఆరా భూభారతి దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ పరిశీలన ఎరువుల పంపిణీ కేంద్రం తనిఖీ నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం విస్తృత స్థాయిలో ఆకస్మిక తనిఖీలు జరిపారు. తహశీల్ కార్యాలయంతో పాటు రేషన్ షాపు, ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. స్థానికంగా గల గ్రామీణ పశు వైద్యశాలను సందర్శించి పనితీరును పరిశీలించారు. ముందుగా తహశీల్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా...