కామారెడ్డి, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ ను శుక్రవారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తనిఖీ చేశారు. సాధారణ పరిశీలనలో భాగంగా ఈవీఎం గోడౌన్ కు వేసిన సీళ్లను పరిశీలించి, గోదాములో భద్రపరచిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు, భద్రపరిచిన ఇతర ఎన్నికల సామగ్రిని సీసీ టీవీ ద్వారా పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తును తెలుసుకున్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, కామారెడ్డి తహసీల్దార్ జనార్ధన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు సరళ, నాయబ్ తహసీల్దార్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.