ఆకస్మిక తనిఖీలతో హడలేత్తిస్తున్న కలెక్టర్
ఇకనైనా ప్రభుత్వ కార్యాలయాల్లో మార్పు కనిపించేనా..! నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన టి. వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలతో హడలేత్తిస్తున్నారు. ప్రతిరోజు ఓ గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామంలోని కార్యాలయాలను పరిశీలిస్తున్నారు. అయితే కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు గోప్యంగా ఉంచడం వల్ల విధులకు డుమ్మాలు కొట్టే ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఏ క్షణంలో కలెక్టర్ తమ కార్యాలయానికి తనిఖీలకు వస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు,సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారు....