ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్న కలెక్టర్

ఇకనైనా ప్రభుత్వ కార్యాలయాల్లో మార్పు కనిపించేనా..!   నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన టి. వినయ్ కృష్ణారెడ్డి  ఆకస్మిక తనిఖీలతో  హడలేత్తిస్తున్నారు. ప్రతిరోజు  ఓ గ్రామాన్ని ఎంపిక చేసుకొని  ఆ గ్రామంలోని కార్యాలయాలను  పరిశీలిస్తున్నారు. అయితే కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు గోప్యంగా ఉంచడం వల్ల విధులకు డుమ్మాలు  కొట్టే ఉద్యోగుల్లో  గుబులు మొదలైంది.  ఏ క్షణంలో  కలెక్టర్ తమ కార్యాలయానికి  తనిఖీలకు వస్తారో  తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు,సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారు....