ముసాయిదా విత్తన బిల్లు-2025 పై అభిప్రాయాల సేకరణ

ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ వెల్లడి   నిజామాబాద్, బతుకమ్మ : వ్యవసాయ శాఖ ద్వారా రూపొందించిన ముసాయిదా విత్తన బిల్లు -2025 పై శుక్రవారం అభిప్రాయ సేకరణ జరిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వ్యవసాయ అధికారులతో పాటు రైతు ప్రతినిధులు, విత్తన డీలర్లు, కంపెనీలు, విత్తన ఉత్పత్తిదారులతో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ముసాయిదా విత్తన బిల్లులోని అంశాలపై చర్చించి వారి అభిప్రాయాలను సేకరించారు. ముసాయిదా బిల్లులో పొందుపర్చిన నాసిరకం విత్తనాల కారణంగా పంట ఉత్పత్తి, విక్రయ దశలో రైతులకు నష్టం కలిగితే నిర్ణీత...