వరి ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : వరి ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని, రైతులకు సమస్యలు రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం లింగంపేట్ మండలం కేంద్రం, మంగారం గ్రామం, నాగిరెడ్డి పేట్ మండలం తాండూర్ గ్రామాల్లోని వరి ధాన్యం కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం ను పరిశీలించి కాంటా వేయాలని, బస్తాల్లో నింపిన ధాన్యం ను సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని అన్నారు....