Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 9:11 pm Posted by : ramakrishna

ఏర్గట్ల బస్టాండ్ వద్ద చలివేంద్రం ఏర్పాటు

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

ఏర్గట్ల గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ సున్నపు లక్ష్మి శ్రీనివాస్ లతో బస్టాండ్ కూడలి వద్ద ప్రజల అవసరాల నిమిత్తం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని గ్రామ ప్రజలు, వివిధ గ్రామాలకు వెళ్లే ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, ఉపసర్పంచ్ సున్నపు లక్ష్మీ శ్రీనివాస్, గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్లు సంగిమ్ ఆనంద్, తునికి శ్రీకాంత్, రవి, కారు పాకల నవీన్, పంచాయతీ కార్యదర్శి జాకీర్ హుస్సేన్, కారోబార్ సాయన్న, మన్నన్, బాపూలు, గుర్రం గంగాధర్, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.