Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 9:12 pm Posted by : ramakrishna

ఎస్‌ఐఆర్‌ సర్వేలో పాల్గొన్న కోఆప్షన్ సభ్యులు

 

. . . కాసుల రోహిత్, ఖామర్ సుల్తానా గౌస్ పాషా

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో భాగంగా  బాన్సువాడ మున్సిపాలిటీలో ఇంటింటి సర్వే నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని టీచర్ కాలనీ 13వ వార్డులో స్థానిక బి.ఎల్.ఏ ఏజెంట్లతో కలిసి కోఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్, ఖామర్ సుల్తానా గౌస్ పాషా ఇంటింటి ఓటర్ల వెరిఫికేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఓటరు వివరాలను పరిశీలిస్తూ, జాబితాలో నమోదైన సమాచారాన్ని ధృవీకరించారు.ప్రజల ఓటరు వివరాలు సక్రమంగా నమోదు కావడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని అన్నారు .ఈ సందర్భంగా కోఆప్షన్ సభ్యులు మాట్లాడుతూ.. ఓటు హక్కు ఎంతో ప్రాముఖ్యత అని ప్రతి ఒక్కరు హక్కు అని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని బిఎల్ఓ ల నుండి నమోదు పత్రాలను తీసుకొని వివరాలను వెల్లడించాలని, చదువుకున్న వారైతే ఆ పత్రాలను నింపి బిఎల్ఓ లకు సకాలంలో బిఎల్ఓ లకు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌ఓలు వాణి, కపిల్ తదితరులు పాల్గొన్నారు.