సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
కామారెడ్డి, బతుకమ్మ : పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇస్తామన్న సీఎం హామీని నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట మండలంలో ఆదివారం మాజీ మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తో కలిసి పర్యటించారు.వరద బాధిత రైతులతో మాట్లాడి నష్టం జరిగిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీష్ రావు మీడియా...