Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 March 2025, 4:04 pm Posted by : ramakrishna

సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిజన బంజారా గోర్ బోలి భాషను రాజ్యాంగంలో 8 వ షెడ్యూల్లో చేర్చే బిల్లు ఆమోదం తెలిపినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం చేశారు.  ఈ సందర్భంగా జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి మాట్లాడారు. సంవత్సరాల నుండి గిరిజన ,బంజారాల భాష అయిన గోర్ బోలికి రాజ్యాంగంలో చేర్చి ప్రాముఖ్య కల్పించాలని డిమాండ్ చేస్తున్న కూడా ఎవరు పట్టించుకోలేదని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజన బంజారాల పక్షాన నిలబడి గోర్ బోలీ భవన్ రాజ్యాంగ 8వ షెడ్యూల్ లో చేర్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. గిరిజనులకు ,బంజారాల గతంలో కానీ ప్రస్తుతం కానీ అండగా నిలబడి వారి అభివృద్ధి కి కృషి చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ తారా చాంద్, డీసీసీ ఉపాధ్యక్షులు చంద్రు నాయక్ పాల్గొన్నారు.