Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 November 2024, 4:33 pm Posted by : ramakrishna

చేగుంటలో సీఎం జన్మదిన వేడుకలు

బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి :  దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని చేగుంట మండల కేంద్రం లో గల గాంధీ చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన తరువాత అనేక చారిత్రాత్మక సంక్షేమ కార్యక్రమాల అమలు చేశారని తెలిపారు. రైతు రుణమాఫీ ,మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం,200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కే గ్యాస్ ,అన్ని గురుకుల పాఠశాలలో 40 మెస్ చార్జీలు పెంచి విద్యా వ్యవస్థలో సముల మార్పులు తీసుకొచ్చే విధంగా 1100 కోట్ల తో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, టీచర్ నియామకాలు , వీసీ ల నియామకాలు చేపట్టి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. రాష్ట్రంలో విద్యా ,వైద్య, ఉపాధి అవకాశాలు పై శ్రద్ధ చూపుతున్న ముఖ్యమంత్రికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

CM's birthday celebrations in Chegunta