జుక్కల్, బతుకమ్మ: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాయకులు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సతీశ్ పటేల్, సొసైటీ మాజీ చైర్మన్ రాజు పటేల్, మద్నూర్ కమిటీ మాజీ చైర్మన్ సాయాగౌడ్, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు అనిల్ సేట్, సన్ను పటేల్, సొసైటీ చైర్మన్ శివానంద్ పటేల్, బాబురావు పటేల్, కృష్ణ మౌళి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.