పేదల వైద్యానికి సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుంది
బాన్సువాడ, బతుకమ్మ : ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యచికిత్సలు చేయించుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో బాన్సువాడ నియోజకవర్గంలోని 182 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద రూ. 54.34 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్నాయని, మునుముందు మరింత ఉంటాయని అందువలన పల్లెల్లో, తాండాలలో,...