Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 November 2025, 6:11 pm Posted by : ramakrishna

సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీ 13వ వార్డుకు చెందిన మొహమ్మద్ జాఫర్ కి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన చికిత్స ఖర్చుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం మంజూరైంది. రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ప్రత్యేక శ్రద్ధతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.75 వేల రూపాయలు, అలాగే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.60 వేల రూపాయలు, మొత్తం రూ.1.35 లక్షలు మంజూరు చేయబడ్డాయి.ఈ ఆర్థిక సహాయం పత్రాన్ని 13వ వార్డు యువ నాయకుడు మొహమ్మద్ గౌస్ స్వయంగా జాఫర్ నివాసానికి వెళ్లి అందజేశారు.